Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:30 IST)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిజానికి బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుంచి మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఒడిశా రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
 
నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంకతో పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని చెప్పింది. 
 
ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడించింది. 
 
మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments