Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షాతో కెప్టెన్ భేటీ - బీజేపీ చేరనుంటూ అమరీందర్ కామెంట్స్

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:57 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన గంటతో పాటు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు పంజాబ్ సీఎం పదవికి ఇటీవలే అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. 
 
అయితే, ఈరోజు అమరీందర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగలేనని క్లారిటీ ఇచ్చారు.
 
అమరీందర్ సింగ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. "ఇంత కాలం కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రయాణం చేయడం సంతోషంగా ఉంది. నా పరిస్థితి ఏమిటో ఇప్పటికే నేను స్పష్టంగా చెప్పాను. నా పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం. 
 
పార్టీకి ఇంత సేవ చేసిన నా పట్ల ఇలా వ్యవహరించి ఉండకూడదు. 52 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ ప్రెసిడెంట్ ఆదేశించారు. 
 
నేను వారిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మీ ఆదేశాల మేరకు ఆ పని చేస్తానని చెప్పాను. అదే రోజు సాయంత్రం నేను గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించాను. నా నిబద్ధతను 50 ఏళ్ల తర్వాత ప్రశ్నిస్తే నేను ఏం చేయాలి? నాపై నమ్మకం లేకపోతే... కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? నమ్మకం లేనప్పుడు ఎవరూ కొనసాగలేరు" అని ఆయన వ్యాఖ్యానించారు.
 
అమిత్ షాతో భేటీ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... తాను బీజేపీలో చేరడం లేదని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఇంతవరకు రాజీనామా చేయలేదని చెప్పారు. క్షణాల్లో నిర్ణయం తీసుకునే వ్యక్తిని తాను కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments