Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో గంజాయి ప్యాకెట్‌తో షారూక్ ఖాన్ కుమారుడు..

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (10:02 IST)
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఇప్పట్లో కష్టాలు వీడేలీ కనిపించడం లేదు. క్రూయిజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు తనిఖీ చేసినపుడు ఆర్యన్ చేతిలో గంజాయి ప్యాకెట్‌తో పట్టుబడినట్టు సమాచారం. దీంతో ఆయనపై ఎన్సీబీ అధికారులు కీలకమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు, ఆర్యన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తనకు అరెస్టయిన వారిలో అర్బాజ్ తప్ప మరెవరితోనూ పరిచయం లేదని ఆర్యన్ కోర్టుకు తెలిపాడు. అర్బాజ్, ఆర్యన్ మంచి స్నేహితులు. షారుఖ్‌ కుమార్తె సుహానాకు కూడా అర్బాజ్ స్నేహితుడే.
 
వీరు ముగ్గురూ కలిసి పలుపార్టీలు చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో అర్బాజ్ మాత్రమే తనకు తెలుసునని, మిగతా ఎవరితోనూ పరిచయం కూడా లేదని కోర్టుకు ఆర్యన్ వివరించాడు. అయితే ఆర్యన్‌, అతని మిత్రబృందాన్ని విచారించకపోతే కేసులో పూర్తి వివరాలు తెలియవని ఎన్సీబీ అధికారులు వాదించారు.
 
కనీసం వారంరోజుల పాటు వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ కోరినట్లు సమాచారం. అయితే గురువారం వరకూ ఆర్యన్‌, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్‌ దమేచాలను ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments