Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెన్సీ నోట్లను రోడ్డుపై వెదజల్లిన వానరం... ఎక్కడ?

కరెన్సీ నోట్లను రోడ్డుపై వెదజల్లిన వానరం... ఎక్కడ?
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:03 IST)
ఓ వ్యక్తి ఆటోలో భద్రతా మూటగట్టిపెట్టుకున్న లక్ష రూపాయల మూటను ఓ వానరం గమనించింది. ఆ మూటలో ఏదో ఆహారం ఉందని భావించిని కోతి... ఎంచక్కా ఆ మూటను పట్టుకెళ్లింది. తీరా ఇప్పిచూస్తే అందులో ఆహారం లేదు కదా కరెన్సీ నోట్లు కనిపించాయి. అంతే.. ఆ నోట్లను రోడ్డుపై వెదజల్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కటవ్ ఘాట్ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కటవ్ ఘాట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఒక ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. వారిలో ఒక వ్యక్తి తన దగ్గరున్న రూ.లక్ష నగదును టవల్‌లో చుట్టి పెట్టుకున్నాడు. మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. 
 
ఎంత సేపటికీ ఆటో కదలకపోవడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులూ కిందకు దిగారు. అప్పుడే దగ్గరలోని చెట్టు మీద ఉన్న ఒక కోతి దిగిన వారిలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్‌ను లాక్కెళ్లింది. దానిలో తినడానికి ఏమైనా ఉందనుకుందో ఏమో గట్టిగా విదిలించింది.
 
అంతే మూటలోని డబ్బు రోడ్డుపై చిందర వందరగా పడింది. ఇంకేముంది.. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన వారిలో చాలా మంది ఆ డబ్బు కోసం ఎగబడ్డారు. కొందరు నిజాయతీపరులు డబ్బు సేకరించి యజమానికి తిరిగిచ్చారు. కానీ చివరకు అతని చేతికి రూ.56 వేలు మాత్రమే దక్కాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో డబ్బు ఎవరు తీసుకున్నదీ తెలుసుకోవడం కుదరలేదని చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా - తెలంగాణాల్లో ఒక సవర బంగారం రేటు ఎంతో తెలుసా?