Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారూఖ్ వీడియో వైరల్

Advertiesment
Shah Rukh Khan
, సోమవారం, 4 అక్టోబరు 2021 (11:27 IST)
Aryan khan
ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చేసింది. ఆ రైడ్‌లో షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆర్యన్‌ అరెస్టు విషయం తెలిసిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌కి మద్దతు తెలుపుతున్నారు. ఆయన స్నేహితుడు, బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆదివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో షారుక్‌ని కలవడానికి మన్నత్‌లోని బంగ్లాకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో పుటేజీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అందులో ఈ కండల వీరుడు రేంజ్ రోవర్ కారు ముందు సీటులో కూర్చుని ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ స్టార్స్‌ మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు రూమర్స్‌ ప్రచారం ఉన్నాయి. ఈ పరిణామంతో అవన్నీ పటాపంచలు అయిపోయినట్లైంది. కాగా డ్రగ్స్‌ వినియోగించినందుకు పలు సెక్షన్ల కింద ఆర్యన్‌తో పాటు మరికొందరిపై ఎన్‌సీబీ కేసు ఫైల్‌ చేసినట్లు సమాచారం.
 
అయితేకొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ ఓ పార్టీలో భాగంగా సరదాగా తన కొడుకు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ తను యవ్వనంలో చేయని పనులన్నింటిని తన కొడుకు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కొడుకు అమ్మాయిలతో తిరగవచ్చు, డ్రింక్, సిగరెట్ తాగొచ్చు, డ్రగ్స్ కూడా ఆస్వాదించవచ్చు అని గతంలో షారుక్ సరదాగా ఈ మాటలు తన కొడుకు గురించి మాట్లాడారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పనులు చేయలేదని కనుక తన కొడుకు ఈ పనులన్నింటినీ చేయవచ్చని చెప్పిన మాటలను ఆర్యన్ నిజం చేసి చూపించాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి శ‌త్రువా! - ఆ పేరు చెప్ప‌డానికి క్కూడా ఇష్ట‌ప‌డ‌నుః మోహ‌న్‌బాబు సెన్సేష‌న్ కామెంట్‌