Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకంటే 15 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్‌ చేస్తాననుకోలేదు (video)

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (11:06 IST)
'15 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్‌ చేస్తాననుకోలేదు. ఇంతమంచి అవకాశం కల్పించిన దేవుడికి ధన్యవాదాలు' అంటూ మాజీ విశ్వసుందరి‌ సుస్మితా సేన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుస్మితా సేన్‌ పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని తల్లయ్యారు. ఈ మాజీ బ్యూటీ క్వీన్‌ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రోహమన్‌, ఆమెకు మధ్య 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సుస్మిత కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడు.

రోహమన్‌ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయినట్టు ఓ ఇంటర్వ్యూలో సుస్మిత వెల్లడించారు. ‘కొన్నెళ్ల క్రితం సోషల్‌ మీడియాలో రోహమన్ నేరుగా ఓ మెసేజ్‌ పెట్టాడు. అది చూసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో‌ రోహమన్‌ను కనెక్ట్‌ అయ్యాను.

ఆ తర్వాత రోజు మేము సందేశాలు పంపుకోవడం చేశాం. కానీ 15 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని ఆ సమయంలో నేను ఊహించలేదు’ అని చెప్పుకొచ్చారు. 
 
‘ఇక ఏదేమైనా మేము మా బంధంతో చాలా సంతోషంగా ఉన్నాం. నేను నా పిల్లలు, రోహమన్‌ ఓ కుటుంబం’ అని పేర్కొన్నారు. అయితే ‘మహిళగా నాకు ఓ తోడు అవసరమని, ఓ వ్యక్తి సావాసం కోరుకునేంత రోమాంటిక్ నేను‌ కాదు. జీవితంలో ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు. రోహమన్‌తో పరిచయం అనుకోకుండా ఏర్పడింది.

అయితే దీనికి ఆ దేవుడికి ధన్యవాదలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే కలిసి ఉండగలరు. లేని పక్షంలో వారు కలిసున్నా వ్యర్థమే’ అని సుస్మితాసేన్‌ అన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments