ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కడుందో తెలుసా?.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!
నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది.
ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను తొలుత 1,400 మీటర్లకు పెంచాలని భావించారు. ఇప్పుడు దాన్ని 1,505 మీటర్లకు పెంచుతున్నారు.
రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరినాటికి పూర్తవుతాయని అంచనా.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈశాన్య రైల్వేజోన్ ప్రధాన కేంద్రమైన గోరఖ్‌పూర్‌లో ప్రపంచంలో అతి పొడవైన 1,366 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫాం ఉంది. హుబ్బళ్లి ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది.