Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ సాంస్కృతిక కేంద్రం..ఎక్కడుందో తెలుసా? (video)

ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ సాంస్కృతిక కేంద్రం..ఎక్కడుందో తెలుసా? (video)
, శనివారం, 7 నవంబరు 2020 (07:39 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ సాంస్కృతిక కేంద్రం త్వరలో ప్రారంభం కాబోతున్నది.  నాగార్జునసాగర్ విజయపురి సమీపంలో హైదరాబాదుకు 145 కిలోమీటర్ల దూరంలో 275 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధ చరితం పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది.
 
తెలంగాణ బౌద్ధ కేంద్ర సర్క్యూట్ గా అవతరిస్తుంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విలసిల్లు తుంది. ఒకవైపు మానవ నిర్మిత మహా కట్టడం నాగార్జునసాగర్ మరోవైపు ఆచార్య నాగార్జునుడు బోధనలతో పరిఢవిల్లిన నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల జలపాతాల పర్యాటక సంగమం  బుద్ధ చరితవనం. 
 
వందలాది శిల్పాలతో 21 మీటర్ల ఎత్తయిన మహా స్తూప చైత్యం ప్రధాన ఆకర్షణగా చూపరులను  ఆకట్టుకుంటుంది. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి సూచికగా జననం నుంచి మహా పరి నిర్వాణం వరకు ఎనిమిది ఉద్యానవనాలు నలభై జాతక కథలు 27 అడుగుల బుద్ధ విగ్రహం ఎనిమిది బౌద్ధ దేశాల విహారాలు కృష్ణా నది తీరంలో  వెలిశాయి.
 
తెలంగాణలో పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ, ప్రపంచ బౌద్ధ సంస్థల సహకారంతో దాదాపు 70 కోట్ల తో ఇప్పటివరకు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నది.
 
మహాచైత్యం లోపల  కాంతులీనుతుంది బుద్ధ విగ్రహం పరివేష్టితుడై ఉండటం చూపు మర ల్చనివ్వదు. 42 అడుగుల మీటర్ల మహాచైత్యం చుట్టూ వందలాది శిల్పాలతో కూడిన జాతక కథలు మనకు బుద్ధుని జీవితానికి బోధిస్తున్నాయి. 
 
మహాచైత్యం లోపల మ్యూజియం ,కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పించబడ్డాయి. బుద్ధ చరితంలోకి అడుగు పెట్టగానే సారనాథ్ లోని అశోక స్తంభం స్వాగతం పలుకుతుంది. ప్రపంచంలోని బౌద్ద నమూనాలకు బుద్ధ చరితం ఆలవాలంగా మారగలదు.
 
నాలుగు ద్వారాలు కలిగిన బుద్ధ చరితం ఎనిమిది భాగాలుగా విభజింపబడి ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో పూల మొక్కలతో అలరారుతుంది. బౌద్ధ ప్రేమికులకు, పర్యాటకులకు ,పరిశోధకులకు ఎన్నో విషయాలను బుద్ధ చరితం అవగతం కలిగిస్తుంది.
 
2003లో ప్రారంభించిన శ్రీ పర్వత బుద్ధ చరితం తుది దశకు చేరుకుంది. పర్యాటకులకు కావలసిన సకల సౌకర్యాలను సమకూర్చుతుంది. బుద్ధ చరిత వనం ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటుంది.

మలేషియా తైవాన్ భారతదేశంలోని బౌద్ధ సంస్కృతి కేంద్రాలు ఇచ్చట విశ్వవిద్యాలయం, పాఠశాలలు నెలకొల్పటానికి ఉత్సాహం చూపుతున్నాయి .నాగార్జున సాగరం తిరిగి క్రీస్తుశకం రెండవ శతాబ్ది నాటి బుద్ధ వైభవానికి  ప్రతీకగా పునరుజ్జీవనం పొందగలదు.

ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతంలో అమరావతి చైత్యాలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుందన డములో సందేహం లేదు. త్వరలోనే బుద్ధ చరితం ప్రారంభానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10న తిరుచానూరులో ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌