ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెపిల్ల స్కాట్లాండ్ లో అమ్ముడుపోయింది. ఆ గొర్రెపిల్ల ధర ఎంతో తెలుసా! అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు. ఇది వేలంలో అమ్ముడుపోయి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
‘డబుల్ డైమండ్’ అనే 6 నెలల ఈ గొర్రెపిల్ల స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో టెక్సెల్ జాతికి చెందినది. యూకేలోని చెషైర్‌లోని మాక్లెస్ఫీల్డ్‌లో పుట్టి, పెరిగిన ఈ గొర్రెపిల్లను ముగ్గురు వ్యాపారులు కలిసి రూ.3.5 కోట్లకు దక్కించుకున్నారు.
టెక్సెల్ జాతికి చెందిన ఇలాంటి ప్రత్యేకమైన గొర్రెల మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, వీటి ఉన్నికి డిమాండ్ ఎక్కువ. 2009లో ఓ గొర్రె రూ.2.2 కోట్లకు అమ్ముడుపోయింది.
దాని రికార్డును ‘డబుల్ డైమండ్’ బద్దలుకొట్టింది. గొర్రె మాంసం పట్ల విపరీతమైన క్రేజ్ చూపే దుబాయ్ షేక్ లు సైతం ఈ ధర విని షాకయ్యారు మరి.