Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను లక్ష రూపాయలకు అమ్మేసిన భర్త.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 12 జులై 2021 (18:55 IST)
భార్య పట్ల ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే ఆ ముగ్గురికి లక్ష రూపాయలకు అమ్మేశాడు. నిన్ను అమ్మేశాను, ఆ ముగ్గురితో వెళ్లిపొమ్మని భార్యతో చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమె చంపేయాలని చూశాడు. మధ్యప్రదేశ్ గునలో ఈ అమానుషం జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. గున ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అతడు ముగ్గురు వ్యక్తుల దగ్గర రూ.50 వేలు అప్పు చేశాడు. అయితే ఆ అప్పు తీర్చే మార్గం లేకపోయింది. దీంతో అతడు వారికి తన భార్య లాడో బాయ్‌ను లక్ష రూపాయలకు అమ్మేశాడు. 
 
ఇంకా వారితో వెళ్లిపో అన్నాడు. అంతే భార్య నిర్ధాంతపోయింది. షాక్‌లో ఉండిపోయింది. అయితే వారితో వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. భర్తతో గొడవపడింది. దీంతో బుధవారం రాత్రి గోపాల్, అతడి తల్లి.. ఇంట్లో నిద్రపోతున్న లాడో బాయ్‌ని తీసుకెళ్లి బావిలో పడేశారు.
 
శబ్దం విన్న స్థానికులు వెంటనే ఆ బావి దగ్గరికి వచ్చి లాడోబాయ్‌ను కాపాడాడు. తర్వాతి రోజు లాడో బాయ్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. లాడో బాయ్ అత్త పోలీసులకు దొరికిపోగా, భర్త గోపాల్ తప్పించుకున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments