Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్లో ఎవడితో మాట్లాడుతున్నావ్...? భార్యకు అక్కడ ఐరన్ బాక్స్ పెట్టిన భర్త...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (18:19 IST)
భార్య ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఇస్త్రీ పెట్టెతో మర్మాంగాలపై కాల్చాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌కి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న రాయిఖండ్ ఏరియాలోని వైశ్యసభలో 45 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. 
 
అతనికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పదేపదే ఫోన్‌లో మాట్లాడుతుండటంతో, అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే పలుమార్లు ఏదో సర్దిచెప్పింది. ఐతే ఆమెపై నమ్మకంలేని భర్త ఆమెకు తెలియకుండా ఫోన్‌లో కాల్ రికార్డర్‌ని యాక్టివేట్ చేశాడు. అది గమనించని భార్య యాధావిధిగా ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడింది. 
 
రికార్డింగ్ కాల్ విన్న భర్తకు అసలు నిజం తెలిసిపోయింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని నిర్ధారించుకున్నాడు. నిజం చెప్పమని భార్యను కొట్టడం ప్రారంభించాడు. అయితే ఆమె నోటితో వాస్తవం చెప్పలేదు. కోపోద్రిక్తుడైన భర్త ఇస్త్రీ పెట్టెతో మర్మాంగాలను కాల్చాడు. పిరుదులు, వీపుపై వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆమె అక్కడ నుండి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. వారి సలహా మేరకు ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments