Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (12:10 IST)
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ప్రియుడు మోజులోపడి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి గదిలోని టైల్స్‌ కింద పాతిపెట్టింది. స్థానికంగా కలకలం రేపింది. మహారాష్ట్రంలో పాల్సర్ జిల్లా నలపోసర ప్రాంతంలోని సాయి వెల్ఫేర్ సొసైటీలో సినీ ఫక్కీలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 28 ఏళ్ల కోమల్ చవాన్ తన భర్త విజయ్ విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయ్ ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని, వాటి రంగు మిగతా వాటికి భిన్నంగా ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి ఆ టైన్స్‌ను తొలగించగా, దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. 
 
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అది విజయ్ చవాన్ మృతదేహమని పోలీసుల ప్రాథమిక విచారణలో కోమల్ చవాన్ నేరాన్ని దాచడానికి వినూత్న పద్ధతిని అనుసరించినట్లు తేలింది. బాత్రూమ్ మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే టైల్స్ తొలగిస్తున్నట్లు పొరుగువారికి చెప్పి నమ్మబలికింది. కోమల్, విజయ్‌కు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా కోమల్, మోనుల మధ్య అఫైర్ నడుస్తోందని స్థానికులు వెల్లడించారు.
 
ఈ హత్యలో కోమల్‌తో పాటు ఆమె ప్రియుడు మోను కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 'దృశ్యం' సినిమాలో మృతదేహాన్ని దాచిన తీరును అనుకరిస్తూ ఈ నేరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కోమల్, మోనులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments