Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (11:41 IST)
ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్‌ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది.
 
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు వైద్య సలహాను పాటించడానికి తాను తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు జగ్దీష్ ధన్కర్ రాజీనామా లేఖలో వెల్లడించారు. స్థిరమైన మద్దతు, సహకారం అందించారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ సభ్యులకు వారి అమూల్యమైన సహకారం మరియు మద్దతు పట్ల ధన్కర్ ధన్యవాదాలు తెలిపారు.
 
తన పదవీకాలంలో చాలా నేర్చుకున్నానని, పార్లమెంటు సభ్యుల నుంచి తనకు లభించిన ఆప్యాయత, నమ్మకం, ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆయన అన్నారు. తన పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని చూసినందుకు ధన్కర్ గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. "భారత్ ప్రపంచ ఖ్యాతి, అద్భుతమైన విజయాలతో నేను గర్వపడుతున్నాను. దేశం ఉజ్వల భవిష్యత్తుపై నాకు గట్టి నమ్మకం ఉంది" అని ఆయన తన వీడ్కోలు సందేశంలో తెలిపారు.
 
జగ్దీష్ ధన్కర్ 2022 ఆగస్టు 11వ తేదీన నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ సేవలు అందించారు. అంతకుముందు, ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను రాజ్యసభ ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments