ప్రియుడుతో వెళుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచివేశాడు. పిమ్మట ఆమె ప్రియుడుతోనే భార్యకు నుదుట బొట్టు పెట్టించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త వారిని వెంబడించాడు. ఓ చోట కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని పట్టుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైనప్పటికీ అతను వినూత్నంగా ప్రవర్తించాడు.
ముందుగా తన భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని స్వయంగా తుడిచివేశాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడుని పిలిచి తన భార్య పాపిటలో మళ్ళీ సిందూరం దిద్దమని ఆదేశించాడు. ఈ అనూహ్య పరిణామంతో ఆ మహిళ, ఆమె ప్రియుడు షాక్‌కు గురయ్యారు.
భర్త చేసిన ఈ పని చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భర్త చర్యను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఇది ఏమాత్రం సబబు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.