జయం రవికి ఆయన భార్య ఆర్తి చెక్ పెట్టింది. తన భర్త నుంచి భరణం కోరుతూ.. చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో జయం రవి తనకు నెలకు రూ.40లక్షల మేర భరణం కింద ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
కాగా జయం చిత్రం ద్వారా పరిచయమైన రవి, తన పేరు జయం రవి అని మార్చుకున్నారు. వరుసగా ఎం.కుమారన్ సన్ ఆప్ మహాలక్ష్మి వంటి అనేక హిట్ చిత్రాలను అందించారు. 2009వ సంవత్సరం ఆర్తిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరబ్బాలు ఉన్నారు. వీరిద్దరి విడాకులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జయం రవి ఈ విడాకుల వార్తల తర్వాత రవి మోహన్‌గా మార్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్తి-రవిల లాయర్ల వాదనలు విన్న కోర్టు కౌన్సిల్ నిర్వహించింది. అయినా రవి విడాకులు కావాలని పట్టుబట్టాడు. ఈ వ్యవహారంపై కోర్టు విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.