బావతో ఏర్పడిన అక్రమ సంబంధం భర్తను హత్య చేసేంతవరకూ వెళ్లిపోయింది ఆ మహిళ. మెదక్ జిల్లా లోని శమ్నాపూర్‌కు చెందిన 28 ఏళ్ల మైలీ శ్రీనుతో లింగాసాన్ పల్లికి చెందిన లతతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఐతే వరసకు బావ అయ్యే మైలీ మల్లేశం తరచూ వీరి ఇంటికి రావడం ప్రారంభించాడు. ఈ క్రమంలో లత-మల్లీశం మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. తన భార్య ప్రవర్తనలో వచ్చిన తేడాను గమనించిన శ్రీను ఆమెను ఓసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఐతే పెద్దలు ఏదో మొదటిసారి తప్పు కనుక వదిలేసి హాయిగా కాపురం చేసుకోమని సలహా ఇచ్చారు.
కానీ లత మాత్రం మల్లీశంను వదల్లేకపోయింది. తరచూ మల్లీశంను కలుస్తూ తన సంబంధాన్ని కొనసాగించింది. మళ్లీ ఏదో ఒకరోజు తన భర్తకు తెలిసిపోతుందని, సంతోషంగా గడపడం సాధ్యం కాదని భర్తను అడ్డుతొలగించుకోవాలని మల్లీశ్ కు విషయం చెప్పింది. తన భర్తను హత్య చేస్తే ఇద్దరం కలిసి హాయిగా వుండవచ్చని చెప్పింది. దీనితో మల్లేశం తన స్నేహితుడు మలిశెట్టి మోహన్‌ను రంగంలోకి దించాడు. తన భర్త శ్రీనుని హత్య చేస్తే రూ. 50 వేలు ఇస్తానని అతడికి హామీ ఇచ్చింది.
ఇక ప్రణాళిక ప్రకారం శ్రీనుకి పార్టీ చేసుకుందాం రమ్మంటూ మలిశెట్టి మోహన్ వెంటబెట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీను చేత పూటుగా మద్యం తాగించి ఆ తర్వాత మద్యం బాటిల్ పగులగొట్టి పొడిచి చంపేసాడు. విషయాన్ని లతకు చెప్పాడు. భర్త హత్య తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనని, ముందుగానే పోలీసు స్టేషనుకు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి తీగ లాగడంతో డొంక కదిలింది. వాస్తవం బైటపడింది. దీనితో లత, మల్లీశం, మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేసారు.