Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 16 మే 2025 (11:46 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును కసాయి తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 14 రోజుల క్రితం ఆయనకు అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని టోలీచౌకీలోని చెత్తకుప్పలో పడేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌కు తెలిపాడు.
 
ఈ దారుణాన్ని గమనించిన నిందితుడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింద. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలను వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్