Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి నిద్ర లేచిన భర్త, పక్కగదిలో ప్రియుడితో భార్య, అంతే...

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (16:06 IST)
ఇంటికి నిత్యం తాగొచ్చే భర్త. ఎన్నిసార్లు చెప్పినా, మార్చాలని ప్రయత్నించినా అతను మాత్రం మారలేదు. బంధువులను పిలిపించి పంచాయతీ పెట్టింది. భర్త వద్దని పుట్టింటికి వెళ్ళింది. ఏం చేసినా భర్తలో మాత్రం మార్పు రాలేదు సరికదా.. పుట్టింటిలో ఉన్న భార్యను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు భర్త. ఇలా విసిగిపోయిన భార్య ప్రియుడిని వెతుక్కుంది. చివరకు అదే ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
 
బీహార్ లోని నౌబత్‌పూర్ గ్రామంలో ఉండే జహేదాబేగానికి, బాబాఖాన్‌కు 10సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బాబాఖాన్ పెయింటింగ్ షాప్‌లో పనిచేసేవాడు. వీరికి డబ్బు సమస్య లేదు. కానీ వచ్చే డబ్బుతో బాగా మద్యం తాగేవాడు బాబాఖాన్.
 
ఇల్లు గుల్ల అవుతోంది.. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మాత్రం మార్పు రాలేదు. పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళితే మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు భర్త. అయితే భర్తతో విసిగిపోయిన భార్య పిల్లలను పుట్టింటిలోనే ఉంచి తాను మాత్రం భర్త ఇంటికి వచ్చింది.
 
భర్తలో మార్పు రాకపోవడం.. దాంతో పాటు ప్రతిరోజు అతను తాగొచ్చి నానా మాటలతో దూషించి నిద్రపోయేవాడు. భర్తతో విసిగిన ఆమె తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ తతంగం కాస్త నెల నుంచి సాగుతోంది. భర్త తాగొచ్చి పడుకుంటే పక్క గదిలో ప్రియుడితో ఎంజాయ్ చేసేది.
 
ఇలా నడుస్తుండగా వారం రోజుల క్రితం భర్త ఉన్నట్లుండి రాత్రి వేళలో నిద్ర లేచాడు. భార్యతో అప్పటివరకూ గడిపిన ప్రియుడు అక్కడి నుంచి మెల్లగా పారిపోయాడు. ఎప్పటికైనా భర్తతో ఇబ్బంది ఉంటుందని భావించి చివరకు అతడిని హత్య చేయాలని కోరింది జహేదాబేగం.
 
తన ముగ్గురు స్నేహితుల సహకారంతో ఇంట్లో నిద్రిస్తున్న బాబాఖాన్‌ను దిండుతో అదిమి ఊపిరాడకుండా చంపేశారు. ఆ తరువాత గుండెపోటుతో  చనిపోయాడని పోలీసులకు చెప్పారు. కానీ మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments