Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుకు అంత్యక్రియలు - గ్రామస్థులపై పోలీస్ కేసు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:13 IST)
తమిళ సంప్రదాయంలో మిళితమైన క్రీడ జల్లికట్టు ఒకటి. ఈ క్రీడా పోటీలను సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో ఈ క్రీడకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పైగా, ఈ క్రీడలో పాల్గొనే ఎద్దులను ఒక యేడాది నుంచి సిద్ధం చేస్తుంటారు. అలా ప్రతి యేటా జల్లి కట్టు క్రీడలో పాల్గొనే ఎద్దు ఒకటి చనిపోయింది. దీనికి ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
మదురై జిల్లాలోని అలంగానల్లూరులో ప్రతి యేటా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఓ ఎద్దు చనిపోయింది. దానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఆ ఊర్లోని వందలాది మంది గుమిగూడారు. ఎద్దు మృతదేహాన్ని పూలతో కప్పి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇలా చేయడం ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలకు విరుద్ధం. అందుకే ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదురై జిల్లా కలెక్టర్ టీజీ వినయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments