వాజ్‌పేయి రాజనీతి అలాంటిది.. జయలలిత కూడా తప్పుచేశానని?

భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గురువారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజనీతి కలిగిన మహానేత అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత విశేషాలకు సంబంధించిన కథనాలు ప్రస్తుతం

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (13:59 IST)
భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గురువారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజనీతి కలిగిన మహానేత అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత విశేషాలకు సంబంధించిన కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విలువలకు అటల్ జీ ఎంత ప్రాధాన్యత ఇస్తారనే విషయానికి ఈ ఘటనే చక్కని నిదర్శనం. 
 
1996లో భిన్నమైన పార్టీలను, శక్తులను ఏకం చేసి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఆయన, ఆపై తనకు మద్దతు లేదని తెలుసుకుని 13 రోజుల తరువాత ఓటమిని హుందాగా అంగీకరించి పదవిని వీడారు. ఆ సమయంలో మేజిక్ ఫిగర్‌కు వాజ్ పేయి సర్కారు కేవలం ఒకే ఒక్క ఓటు దూరంలో ఉంది. విశ్వాస పరీక్షలో విజయం సాధించేందుకు వాజ్‌పేయి ఏ ఇతర ఎంపీని ప్రలోభాలకు గురిచేయలేదు. దీంతో అటల్ జీ రాజకీయ నీతి ఎలా వుండాలో చెప్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ సమయంలో ఆయన ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసుంటే, తన ప్రభుత్వాన్ని కాపాడుకుని ఉండేవారు. పదవిని తృణప్రాయంగా వదిలి, పలువురికి ఆదర్శప్రాయుడిగా నిలిచారు వాజ్ పేయి.
 
1998లో మరోసారి తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, హుందాగానే ఉన్నారు తప్ప, ఫిరాయింపులను ప్రోత్సహించే పని చేసేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు వాజ్ పేయి. 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 13 నెలల తరువాత, విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన వేళ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హ్యాండిస్తే, అప్పుడు కూడా హుందాగా పదవి నుంచి హుందాగానే దిగిపోయారు. వాజ్ పేయికి మద్దతు ఉపసంహరించుకుని తాను తప్పు చేశానని జయలలిత సైతం తరువాతి కాలంలో అంగీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments