భలే దొంగ.. విమానం ప్రయాణం.. గూగుల్ మ్యాప్ ద్వారా చోరీలు!!

Webdunia
గురువారం, 6 జులై 2023 (08:43 IST)
దొంగల్లో కూడా పలు రకాలైన వారు ఉంటారు. చిల్లర దొంగలు, ఘరానా దొంగలు, కాస్ట్లీ దొంగలు, మంచి దొంగలు ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తాజాగా ఓ దొంగ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘట కేరళలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేస్తున్నట్టు తిరువనంతపురం పోలీస్ కమిషనర్ వెల్లడించాడు. 
 
ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. "ఈ వ్యక్తి కేరళకు విమానంలో వస్తుంటాడు. ఇక్కడకు వచ్చాక ఆటోల్లో స్థానికంగా చక్కర్లు కొడుతూ తాళం వేసి ఉ్న ఇంట్లో ఏవో గుర్తిస్తాడు. ఆ తర్వాత గూగుల్ మ్యాచ్ సాయంతో రాత్రి సమయంలో మళ్లీ ఆ ఇళ్లకు వచ్చి చోరీలు చేస్తాడు. అతడు కేవలం బంగారు నగలు మాత్రమే చోరీ చేసి వాటిని ఖమ్మం తీసుకెళ్లేవాడు. ఆ నగలను అక్కడ తాకట్టుపెట్టి వచ్చిన డబ్బును తీసుకుని విలాసాలకు ఖర్చు చేసేవాడు. గత నెలలో పద్మనాభస్వామి ఆలయం సందర్శనకు వచ్చాడు. ఇందుకు జూన్ నెలలోనే ప్రణాళిక రచించుకున్నాడు. ఆ ప్రకారం మళ్లీ వచ్చాడు" అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments