Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలాఖరుకు కోవొవాక్స్ టీకా : సీరమ్ ఇనిస్టిట్యూట్

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (15:48 IST)
మన దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ప్రముఖ టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌ ఆఖరునాటికి  ‘కొవొవాక్స్‌’ టీకాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్‌ చేశారు. 
 
‘‘నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్‌’ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది. భారత్‌లో ట్రయల్స్‌ కోసం ఇప్పటికే అనుమతులు కోరాం. కొవొవాక్స్‌ను జూన్‌ కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం.’’ అని అదర్‌ పూనావాలా ట్విటర్‌లో పేర్కొన్నారు. 
 
‘కొవొవాక్స్‌’ టీకాపై భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం సిద్ధమైంది. దీనిని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు కోరినట్లు సీరం సంస్థ శుక్రవారం తెలిపింది.
 
కాగా ఈ కొవొవాక్స్‌ టీకా సామర్థ్యం 95.6 శాతంగా తేలినట్లు సీరం సంస్థ గతంలో ప్రకటించింది. నోవావాక్స్‌ సంస్థతో గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న సీరం ఏప్రిల్‌ నుంచి నెలకు 40-50 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ యూకే రకం వైరస్‌ను కూడా సమర్థవంతంగా కట్టడి చేయగలదని ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైనట్లు వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments