గుడ్ న్యూస్. కోవిడ్ వ్యాక్సిన్ చౌక ధరలో అందుబాటులోకి రానుంది. తాజాగా సీరం ఇన్‌స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్‌ను తక్కువ ధరలోకి అందించనుంది. టీకాల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న ఈ సంస్థ ఉత్పత్తి సామార్థ్యం పరంగా కూడా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారుగా చెబుతారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్ అవసరాలు తీర్చేందుకు సీరం అనువైనదిగా నిపుణుల అభిప్రాయంగా ఉంది. కేంద్రం కూడా సీరం పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో సీరం కోవిడ్ వ్యాక్సిన్‌పై కీలక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది.. కరోనా టీకాను కేవలం రూ.250కే అందిస్తామంటూ ఆ ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రదిపాదన పంపినట్టుగా సమాచారం.
కాగా, ఆక్సఫర్డ్ టీకా ధర రూ. వెయ్యి వరకు ఉండొచ్చని గతంలో సీరం సీఈవో ప్రకటన చేవారు.. కానీ, వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సీరం మాత్రం ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.