తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

ఠాగూర్
ఆదివారం, 5 అక్టోబరు 2025 (13:34 IST)
తమిళనాడు రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా, 12 జిల్లాల్లో ఆదివారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
 
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం మదురై, రామనాథపురం, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తిరుపత్తూరు, నామక్కల్, తిరుచిరాపల్లి, దిండిగల్, తేని, విరుదునగర్, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
 
దక్షిణ ద్వీపకల్పం, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవస్థ బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి తేమను ఎక్కువగా గ్రహిస్తుండటంతో వర్ష తీవ్రత పెరుగుతోందని తెలిపారు. 
 
కాగా, శనివారం కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కృష్ణగిరి జిల్లాలోని హోసూరులో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దిండిగల్‌లో 11 సెం.మీ., విల్లుపురం జిల్లాలోని అవలూరుపేట, సెమ్మెడు ప్రాంతాల్లో 10 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
 
ఇక రేపటి నుంచి 10వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments