Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి నమితతో సెల్ఫీ కోసం పోటీ పడిన బీజేపీ నేతలు... పరుగో పరుగు

Advertiesment
namitha

సెల్వి

, శనివారం, 4 అక్టోబరు 2025 (19:42 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని తమిళనాడు బీజేపీ శాఖ వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, శుక్రవారం రాత్రి రెడ్ హిల్స్‌లో ఆ పార్టీ ఉత్తర చెన్నై విభాగం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో అర్హులైన పేదలకు వివిధ రకాలైన సంక్షేమ సహాయాలను పంపిణీ చేశారు. 
 
ఈ కార్యక్రమానికి సినీ నటి, తమిళనాడు బీజేపీ మహిళా నేత నమిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో ఆమె ప్రసంగిస్తూ, ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఏకరవు పెట్టారు. ఈ సభ ముగిసిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు నమితతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. 
 
దీన్ని చూసిన కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు వేదికపైకి ఒక్కసారిగా దూసుకుని వచ్చారు. అలాగే, ఆ సభకు హాజరైన స్థానికులు కూడా వేదికపైకి రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. దీంతో భయపడిపోయిన నమిత.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకుని కారులోకి జారుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్‌లో విపత్తు ఉపశమనం- సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా