Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త పోలీసింగ్ : ఢిల్లీ పోలీసులపై హైకోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:36 IST)
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్త పోలీసింగ్ అంటూ మండిపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు చెందిన కార్యకర్తలు చేసిన దాడికి పోలీసులే కారమణంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులై వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపింది. 
 
"ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్ఛా గత నెల 30వ తేదీన సీఎం నివాసంపై దాడి జరిగింది. బారికేడ్లను తొలగించి విధ్వంసానికి పాల్పడింది. 
 
ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ దాడి ఘటన పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 
 
కేజ్రీవాల్ నివాసం వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తేల్చి 2 వారాల్లో తమకు నివేదిక సమర్పించాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించి తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదావేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments