పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (12:08 IST)
ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ సైన్యం హస్తమున్నట్టు నిరూపించే బలమైన ఆధారాన్ని భారత భద్రతా బలగాలు సంపాదించాయి. ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా, అధికారులు కాశ్మీరులు వందలాది మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలోనే పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ ముసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. 
 
హషిమ్ మూసా పాక్ పారా కామాండ్ అని, లష్కర్ తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు తేల్చాయి. తమ అదపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ముూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కూడా ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. ముసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్టు గుర్తించారు. 
 
పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూపు నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్టు తెలుస్తోందని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్‌లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments