Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టు భయంతో దుబాయ్‌కు పారిపోయిన పూజ్ ఖేడ్కర్!!

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (10:54 IST)
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు అరెస్టు భయం పట్టుకుంది. తప్పుడు ధృవీకరణ పత్రాల సమర్పణ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె దేశం దాటిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మొబైల్ ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది. ఆమె దుబాయ్‌కు పారిపోయివుంటారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కేసులో ఆమె తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించి నేపథ్యంలో పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె తన ఫోన్‌ను స్విచాఫ్ చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు తప్పదని భావించిన ఆమె దుబాయ్‌కు పారిపోయినట్టు తెలుస్తుంది. 
 
మరోవైపు, పూజ వివాదం నేపథ్యంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వస్తున్నాయి. కేంద్రం కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ (డీపీటీవో) వారి పత్రాలను పరిశీలించనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తమ ఎదుట హాజరు కావాలన్న ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఆమె యూపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments