Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిపై తండ్రి అత్యాచారం.. అబార్షన్.. చెల్లెలిపై కూడా ఇదే జరగడంతో..?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (08:59 IST)
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలోని హిస్సార్‌లో చోటుచేసుకుంది. రక్తం పంచుకొని పుట్టిన కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రే ఏడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న తన తండ్రి గత ఏడేళ్లుగా తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని తెలిపింది.
 
పలుమార్లు గర్భం రావడంతో అబార్షన్‌ చేయించాడని వాపోయింది. ఆ తర్వాత తన అక్క ఇంటికి కొన్నాళ్లపాటు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి తన చెల్లెల్ని వేధించడం ప్రారంభించాడని పేర్కొంది.

దీంతో భరించలేని ఆ బాలిక తల్లికి ఈ విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments