Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమలంటే అలర్జీ.. రొట్టెలు తింటే తలనొప్పి... యువతి సూసైడ్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:58 IST)
ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహార ధాన్యం గోధుమలు. గోధుమ పిండితో చేసిన వంటకాలే ఇక్కడ ప్రధాన ఆధారం. అదే దక్షిణ భారతదేశంలో అయితే, వరి ధాన్యంతో చేసిన ఆహారం కీలకం. కానీ, ఉత్తరాదికి చెందిన ఓ యువతికి గోధుమలు చూస్తేనే అలర్జీని. వాటిని చూసి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని జీంద్ ప్రాంతానికి చెందిన సురభి (25) అనే యువతికి ఇంకా పెళ్లి కాలేదు. ఈమెకు చిన్నప్పటి నుంచి గోధుమలంటే అలర్జీ. వాటిని చూస్తేనే తట్టుకోలేకపోయేది. పైగా, గోధుమలతో చేసిన ఏ ఆహారాన్నీ ఆమె ముట్టేది కాదు. 
 
బీటెక్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే ఆమెకు వైద్యం చేయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో ఆమె క్రమంగా తన బరువును కోల్పోయింది. 52 కిలోల బరువుండే ఆమె 32 కిలోల బరువుకు తగ్గిపోయింది. 
 
రొట్టెలు తింటే తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతుండే ఆమె, దాన్ని మానేసి, బియ్యం, పల్లీలపై ఆధారపడినా బరువులో మార్పులేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments