Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకుంటానని బిడ్డను తెచ్చుకుని.. అలాంటి పని చేసింది..

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:33 IST)
తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన చిన్నారిని పెంచుకుంటానని తెచ్చుకుంది ఓ మహిళ. అక్రమంగా పసిపాపను పెంచుకుంటానని తెచ్చుకున్న చిన్నారికి నరకం చూపింది. కనీసం ఆలనాపాలన కూడా కరువైంది. 17 రోజులకే ఆ పాప నిరాదరణకు గురైంది. ఇరుపొరుగు వారి సమాచారం మేరకు అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి తెలిసినవారి ద్వారా 17 రోజుల పసిపాపను తెచ్చి పెంచుతుంది. కొంత డబ్బులు ముట్టజెప్పి చిన్నారిని తీసుకువచ్చింది. కానీ, ఆ పాప ఆరోగ్యంపై సరిగా శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పాప జబ్బు పడింది. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
చైల్డ్‌లైన్‌ జిల్లా అధికారులు తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. ఈ దర్యాప్తులో ఎటువంటి దత్తత పత్రాలు లేకుండా అక్రమ పద్ధతిలో ఆ పాపను తీసుకు వచ్చినట్లు గుర్తించారు. ఆ పసికందును స్వాధీనం చేసుకొని బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments