Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి

Advertiesment
గుంటూరు జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:41 IST)
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ఘోర ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. గుంటూరులోని శావల్యాపురం మండలంలోని బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
 
కనకమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారును ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకు చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. గాయపడ్డ వారందరినీ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఉధృతంగానే కరోనా వైరస్... మరో 10 వేల కేసులు