Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేయడం ఏమాత్రం ఇష్టం లేక ఓ యువకుడు తన చేతి వేళ్లను నరుక్కున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
సూరత్‌ నగరంలోని మయూర్ తారాపర (32) రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతని చేతివేళ్లు కూడా తెగిపోయినట్లుగా గుర్తించారు. పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందో పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ మయూర్ మొదట ఓ కట్టు కథను అల్లాడు. తన చేతి వేళ్లను ఎవరో కత్తిరించారని చెప్పాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలో చూడగా... పని చేయడం ఇష్టం లేక తనకు తానే ఉద్దేశపూర్వకంగా చేతి వేళ్లను నరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
నగరంలోని వరచ్చా మినీ బజారులోని తన బంధువుల డైమండ్స్ దుకాణంలో పని చేయడం ఇష్టం లేకే మయూర్ ఈ చర్యకు పాల్పడినట్లుగా సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పని చేయలేనని అతను తన కుటుంబ సభ్యులకు, యజమానికి చెప్పలేక ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తన ఎడమ చేతి నాలుగు వేళ్లను కత్తితో నరుక్కొని... బ్యాగులో వేసి... పడేశాడు.
 
ఇందుకోసం సింగన్పూర్‌లోని చార్ రాస్తా సమీపంలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. కత్తిని కొనుగోలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఓ రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ మోటార్ సైకిల్‌ను పార్క్ చేసి రాత్రి 10 గంటల సమయంలో తన చేతి వేళ్లను నరుక్కున్నాడు.
 
మయూర్ ఈ దుకాణంలో అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును క్రైమ్ బ్రాంచికి బదిలీ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments