Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సారీ అమ్మా.. నిన్ను చంపేశాను.. నిన్ను కోల్పోతున్నాను.. ఓం శాంతి" : కన్నతల్లిని కడతేర్చిన కొడుకు!

Advertiesment
murderer

ఠాగూర్

, శనివారం, 31 ఆగస్టు 2024 (12:58 IST)
"సారీ అమ్మా.. నిన్ను చంపేశాను.. నిన్ను కోల్పోతున్నాను.. ఓం శాంతి" అంటూ కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో వెలుగు చూసింది. ఇరుగుపొరుగు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు గురైన మహిళ పేరు జ్యోతిబెన్ గోసాయి అని, ఆమె వయసు 48 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. తొలుత తన తల్లిపై కత్తితో దాడికి ప్రయత్నించానని, అయితే ఆమె కత్తిని లాక్కుందని, ఆ తర్వాత దుప్పటితో గొంతునులిమి ప్రాణాలు తీసినట్టు దర్యాప్తులో నీలేశ్ అంగీకరించాడని పోలీసులు వివరించారు. నేరానికి పాల్పడ్డ తర్వాత అతడు తల్లి డెడ్ బాడీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడని తెలిపారు. 
 
ఈ ఫోటో కింద.. 'సారీ అమ్మ నేను నిన్ను చంపేశాను. నేను నిన్ను కోల్పోతున్నాను. ఓం శాంతి' అని పోస్ట్ పెట్టాడు. మరో పోస్ట్ పెట్టి 'ను మా అమ్మను చంపాను. నా జీవితాన్ని కోల్పోయాను. క్షమించు అమ్మ. ఓం శాంతి. మిస్ యూ అమ్మ' అని రాసుకొచ్చాడు. మరోవైపు, హత్యకుగురైన జ్యోతిబెన్ కొన్నేళ్లుగా తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమెకు, కొడుకు నీలేశ్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని, భౌతిక దాడులు కూడా చేసుకునేవారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిట్టు వెల్లడించారు. హత్యకు ముందు కూడా తల్లి, కొడుకు మధ్య ఘర్షణ జరిగిందని, తీవ్ర వాగ్వాదం కాస్తా నేరానికి దారితీసిందని వివరించారు.
 
మృతురాలు జ్యోతిబెన్ కు 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి నీలేశ్‌తో జీవించింది. భర్త, మిగతా పిల్లలు వీరితో సంబంధం లేకుండా దూరంగా వేరే చోట నివసిస్తున్నారు. మానసిక సమస్యలకు ఆమె చాలా కాలం నుంచి చికిత్స పొందుతోంది. అయితే గత నెల రోజుల నుంచి ఆమె మందులు వాడడం మానేసిందని, దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిందని పోలీసులు అధికారి ఒకరు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్‌లను వదిలిపెట్టం : ముంబై నటి కేసులో సీఎం చంద్రబాబు హెచ్చరిక