Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్‌టీ 5 నుంచి 6 శాతానికి పెంపు

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:54 IST)
లోటు ఆదాయంతో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఖజానా నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్లను పునర్‌ వ్యవస్థీకరించే యోచనలో ఉంది.

ప్రస్తుతం జీఎ్‌సటీలో నాలుగు (5,12,18,28 శాతం) పన్ను శ్లాబులున్నాయి. అందులో 5 శాతం శ్లాబు రేటు ను 6 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి జీఎ్‌సటీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల మేర పెరగవచ్చని అంచనా.

ఈ నెల 18న సమావేశం కానున్న జీఎ్‌సటీ మండలి ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ శ్లాబ్‌ రేటును పెంచితే నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆహారోత్పత్తులు, పాదరక్షలు, సామాన్యులు ఉపయోగించే వస్త్రాలన్నీ ఈ శ్లాబ్‌ పరిధిలోకే వస్తాయి.
 
మొత్తం వసూళ్లలో 5 శాతం వాటా
ప్రభుత్వానికొచ్చే మొత్తం జీఎ్‌సటీ ఆదాయంలో 5 శాతం శ్లాబ్‌ ద్వారా సమకూరే వాటా 5 శాతమే. నెలవారీ జీఎ్‌సటీ వసూళ్లను రూ.1.20 లక్షల కోట్ల స్థాయికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

కానీ, సెప్టెంబరులో జీఎ్‌సటీ ఆదాయం 19 నెలల కనిష్ఠ స్థాయి రూ.91,916 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. అక్టోబరులో రూ.95,380 కోట్లకు, నవంబరులో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments