దీపావళి వేళ పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏఐక్యూ)లో వాయు కాలుష్యం స్థాయి 313గా నమోదయ్యింది. మధ్యాహ్నం రెండు గంటలు కాగానే ఏక్యూఐ స్థాయి 341గా నమోదయ్యింది. రాజధానిలోని 37 ఏక్యూఐ స్టేషన్లలోని 29 స్టేషన్లలో వాయుకాలుష్యం అత్యంత అధికంగా నమోదయ్యింది.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 318, గజియాబాద్‌లో 397, గ్రేటర్ నోయిడాలో 315, నోయిడాలో 357గా నమోదయ్యింది. గత ఏడాది దీపావళి సమయంలో ఏక్యూఐ 600 మార్కును దాటింది. 2017లో ఏక్యూఐ 367గా నమోదయ్యింది.