Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:29 IST)
పెట్రో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.
 
బుధవారం పార్లమెంట్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ఇతర అంశాలతో పాటు.. బడ్జెట్‌ కేటాయింపులు, నిత్యావసరాల ధరలు, పెట్రో ధరలను ప్రస్తావించారు. రక్షణ, ఆరోగ్య రంగాలలో మోసపూరిత లెక్కలతో ప్రజలను మభ్యపెట్టి మోసగించే ప్రతిపాదనలు చేశారని కామెంట్ చేసిన శశిథరూర్.. లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్.. జై కిసాన్' అని నినదిస్తే.. తాజా బడ్జెట్ దానికి పూర్తి వ్యతిరేకంగా నా జవాన్.. నా కిసాన్ అని స్పష్టం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇక, ఈ బడ్జెట్ మధ్య తరగతి వారిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వారికి ఏం ఇచ్చారని అడిగితే పెట్రోల్ ధరలో పెరుగుదల ఇచ్చారని ఎద్దేవా చేశారు.. 2014 నుంచి పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 894 శాతం పెంచేశారని తెలిపిన శశిథరూర్.. ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments