Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Budget2021 : చెన్నై - బెంగుళూరు మెట్రోక్ మహర్ధశ .. ఊసేలేని ఏపీ!

#Budget2021 : చెన్నై - బెంగుళూరు మెట్రోక్ మహర్ధశ .. ఊసేలేని ఏపీ!
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:08 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021-2022 బడ్జెట్‌‌లో చెన్నై, బెంగుళూరు మెట్రోకు నిధుల ప్రవాహం పారించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున చెన్నై మెట్రోకు రూ.63,246 కోట్లు కేటాయించగా, బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ, ఏపీలో ప్రతిపాదిత విజయవాడ, వైజాగ్ మెట్రో ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో గురించి నిర్మలా సీతారామన్ కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించలేదు. కాగా, ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
 
* 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
* ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్‌
* గోవా డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు
* దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కలు
* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు
* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
* చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
* బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
* 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
* జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు
* ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
* 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం
* 2025 నాటికి 4.8 శాతం టార్గెట్‌
 
 
* నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
* ఎలక్ట్రానిక్‌ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
* రీసెర్చ్ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం రూ. 5 వేల కోట్లు
* స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కు రూ. 3 వేల కోట్లు
* ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
* మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు
* కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
* అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
* వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
 
* ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
* వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం
* రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
* కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
* రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
* 2021-22లో బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
* కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌
 
* ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్‌‌థ భారత్‌ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్‌
* మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
* గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
* బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
* స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
* ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు
* రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
* రూ. 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
* రెగ్యులేటర్‌ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
* వాహనరంగం వృద్ధి చర్యలు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నం బీచ్‌లో మరణాల నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌