Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే వారికి శుభవార్త!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:05 IST)
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే వారికి శుభవార్త! కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ, రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీయూ సెట్‌ ప్రకటన వెలువడింది.

ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు 4 రాష్ట్రస్థాయి సంస్థలు అందిస్తున్న కోర్సుల్లో చేరడానికి వీలవుతుంది. యూజీ, పీజీ, రీసెర్చ్​ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీయూ సెట్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ సంస్థల్లో విస్తృతంగా ఉన్న రకరకాల కోర్సుల్లో చేరటానికి సీయూ సెట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. మ్యాథ్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, జువాలజీ, జర్నలిజం, ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌.. కోర్సు ఏదైనప్పటికీ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అన్ని విద్యాసంస్థల్లోని సీట్లకూ పోటీ పడవచ్చు.

ఈ కేంద్రీయ సంస్థలన్నీ ప్రమాణాలకు పేరుపొందినవే. ఇంటర్‌ అర్హతతో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా అందరూ పోటీ పడవచ్చు. మిగిలిన 4 రాష్ట్రస్థాయి సంస్థలకు స్థానిక రిజర్వేషన్లు వర్తిస్తాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments