గోవా బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం... ఆంధ్రా అమ్మాయిలను తీసుకెళ్లి...

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (11:27 IST)
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న గోవాలోని సముద్రతీరంలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
పనాజీ నగరంలోని కలాన్‌గుటీ బీచ్ కేంద్రంగా గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగుతోంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని క్రైంబ్రాంచ్ పోలీసులకు రహస్య సమచారం వచ్చింది. దీంతో పోలీసులు మారువేషంలో విటుడిలా ఓ పోలీసును పంపించగా వ్యభిచారం రాకెట్ బాగోతం వెలుగుచూసింది. 
 
ఆండ్రియా పెరీరా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి క్రైంబ్రాంచ్ పోలీసులు వ్యభిచార రాకెట్ బాగోతాన్ని బయటపెట్టారు. మహారాష్ట్ర, ఆంధ్రాల నుంచి అమ్మాయిలను గోవాకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ వ్యభిచార రాకెట్ కీలక సూత్రధారులైన అక్షయ్(27), థోఫిక్ (27) లను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారిణులను గోవాలోని రాష్ట్ర మహిళల సదనానికి తరలించారు. ఈ వ్యభిచార రాకెట్‌పై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments