Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:28 IST)
యాసిడ్ దాడి, అత్యాచారం, లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో చికిత్స చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఉచిత వైద్యంలో భాగంగా మెడికల్ పరీక్షలు కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
లైంగిక దాడుల బాధితులకు చికిత్స నిరాకరించడం చట్ట రీత్యా నేరమని, సంబంధిత హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మేనేజ్మెంట్ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు జడ్జిలు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
 
లైంగిక దాడుల నుంచి బయటపడిన బాధితులు ఉచిత వైద్య చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఉచిత చికిత్సలో భాగంగా అవసరమైన అన్ని పరీక్షలు, రోగ నిర్ధారణ టెస్టులు చేయడంతో పాటు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ కూడా అందించాలని స్పష్టం చేసింది. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం