Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:18 IST)
గత ఆరు నెలలుగా అహోరాత్రులు శ్రమిస్తున్నప్పటికీ వైకాపా పాలకుల విధ్వంసానికి ఎక్కడా పరిష్కారమార్గం లభించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి విజయవాడ నగరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ విషయంలో మాత్రం ఎలాంటి రాజీపడబోమని చెప్పారు. 
 
గత ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధన చేస్తున్నా గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది. 
 
గత పాలకులు ఐదేళ్లలో క్రైస్తవ అనుబంధ విద్యాసంస్థలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments