Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోల్‌కతా మెడికోపై అత్యాచారం జరగలేదట.. త్వరలో సీబీఐ చార్జిషీటు!

victim

ఠాగూర్

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (12:54 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్యకాలేజీ ఆస్పత్రికి చెందిన జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే సీబీఐ చార్జీషీటు దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలో ఎయిమ్స్ నిపుణుల పరిశీలన కోసం నిందితుడి డీఎన్‌ఏతో కూడిన వైద్య రిపోర్టులను పంపించినట్టు వెల్లడించారు. అక్కడి వైద్యులు తుది అభిప్రాయం పొందిన తర్వాత ఈ కేసు దర్యాప్తును ముగించాలని సీబీఐ భావిస్తుంది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో పాటు సహా 100 మందికిపైగా వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 10 మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇవన్నీ చేసిన అనంతరమే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదని నిర్ణయానికి వేచ్చినట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి. 
 
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ ఆరోగ్యం విషమం! 
 
సీపీఎం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆరోగ్య పరిస్థితితి మరింత క్లిష్టంగా ఉంది. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయనను గురువారం రాత్రి వెంటిలేటర్‌పై ఉంచి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
72యేళ్ల సీతారాం ఏచూరీ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతున్నారు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ ప్రకటించలేదు. 
 
మరోవైపు ఇటీవలే ఆయన కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆగస్టు 31నే సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. 'భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు' అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎస్ అధికారులపై ముంబై నటి జెత్వానీ ఫిర్యాదు!!