Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా వేయించుకో... బహుమతి అందుకో.. తమిళనాడులో వినూత్న ఆఫర్

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (08:55 IST)
'వ్యాక్సిన్ వేయించుకో...అలా వాషింగ్ మిషన్, వెట్ గ్రైండర్, మిక్సీ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్ నీ సొంతం చేసుకో' అంటోంది తమిళనాడులో కరూర్ జిల్లా యంత్రాగం. ఆదివారంనాడు జరగనున్న మెగా వ్యాక్సిన్ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరూర్ కలెక్టర్ టి.ప్రభు శంకర్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎక్కువ మందిని వ్యాక్సినేషన్‌ వైపు ఆకర్షించేందుకు ఈ ఛాన్స్ కల్పించామని ఆయన తెలిపారు.

తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 18 ఏళ్లు నిండిన వారికి వారం వారం ఈ మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది కరూర్‌లో వరుసగా ఇదో వారం నిర్వహిస్తున్న క్యాంప్‌ అని తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఎంతమందిని తీసుకువస్తే అన్ని ఐదు రూపాయలు చొప్పున వలంటీర్‌కు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

ఆదివారం జరిపే మెగా వ్యాక్సినేషన్ క్యాంపులో వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం డ్రా కూడా నిర్వహించనున్నారు. తొలి బహుమతిగా వాషింగ్ మిషన్, రెండో బహుమతి వెట్ గ్రైండర్, మూడో బహుమతిగా మిక్సీ గ్రైండర్స్ ప్రదానం చేస్తారు.

నాలుగో బహుమతిగా 25 మందికి ప్రెషర్ కుక్కర్లు ఇస్తారు. కన్సొలేషన్ బహుమతిగా 100 మందికి వంటపాత్రలు ఇస్తారు. 25 మందికి పైగా వ్యక్తులను తీసుకువచ్చిన వలంటీర్ల పేర్లను కూడా లక్కీ డ్రాలో చేరుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments