బడి నుంచి ఇంటికొస్తుంటే కారులో లాక్కెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (10:25 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలిక బడి ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కారులో లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని సరాన్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక స్కూలు ముగిసిన అనంతరం సైకిలుపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. కారులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బసంత్ రోడ్డులో బాలికను కారు నుంచి కిందికి తోసేసి పరారయ్యారు. 
 
తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడిన బాలిక పాదచారుల మొబైల్ ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గంటపాటు ఆమెను కారులో తిప్పి అత్యాచారానికి ఒడిగట్టారని సరాన్ జిల్లా ఎస్పీ హరికిశోర్ రాయ్ తెలిపారు. 
 
ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, అత్యాచారానికి పాల్పడింది మాత్రం ముగ్గురేనని వివరించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం