Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించలేదనీ... కసక్.. కసక్‌మంటూ 12 సార్లు కత్తితో పొడిచాడు...

Advertiesment
ప్రేమించలేదనీ... కసక్.. కసక్‌మంటూ 12 సార్లు కత్తితో పొడిచాడు...
, శనివారం, 29 జూన్ 2019 (17:22 IST)
కేరళ రాష్ట్రంలోని మంగుళూరులో పట్టపగలు రోడ్డుపక్కన దారుణం జరిగింది. డ్యాన్స్‌ స్కూల్‌లో పరిచయమైన ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువకుడు కిరాతకుడిగా మారిపోయాడు. యువతి నివశించే ఇంటికి కూతవేటుదూరంలో అడ్డగించి... నడి రోడ్డుకు పక్కన ఆమె కడుపులో 12 సార్లు కత్తితో పొడిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పాదాచారులను సైతం అతను కత్తితో బెదిరించాడు. ఆ తర్వాత తను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగుళూరులోని శక్తినగర్‌కు చెందిన సుశాంత్ అనే యువకుడు ఓ డ్యాన్సర్‌గా ఉన్నాడు. పైగా, అదే ప్రాంతంలో ఉన్న ఓ డ్యాన్సింగ్ స్కూల్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో అదే స్కూల్‌కు వచ్చే ఓ యువతిపై మనసుపడ్డారు. కానీ, ఆ యువతి మాత్రం అవేం పట్టించుకోకుండా డ్యాన్స్ స్కూల్‌కు వెళ్ళివచ్చేది. 
 
అయితే, సుశాంత్ ప్రేమ పేరుతో వెంటపడుతుండటంతో అతడిని మందలించి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దీన్ని సుశాంత్ జీర్ణించుకోలేక పోయాడు. పైగా, ఆ యువతిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రంలో ఆ యువతి శుక్రవారం తన ఇంటి నుంచి బస్టాండ్‌కు వెళుతుండగా ఎదురుపడి వాగ్వాదానికి దిగాడు. 
 
తనను ప్రేమించాలని సుశాంత్ ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ యువతి సమ్మతించలేదు. దీంతో సహనం కోల్పోయిను సుశాంత్... ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ యువతి వేటగాడి చేతిలో లేడికూనలా మారిపోయింది. ప్లీజ్.. ప్లీజ్ అని వేడుకుంటున్నా వదిలిపెట్టలేదు. 
 
చేతులు జోడించినా కనికరం చూపలేదు. ఉన్మాదిలా మారిపోయిన సుశాంత్.. మొత్తం 12 కత్తిపోట్లు పొడిచాడు. ఆ తర్వాత తనను తాను పొడుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు దగ్గరకు వద్దామని ప్రయత్నిస్తున్నా.. కత్తితో బెదిరిస్తూ అందరినీ దూరంగా అదిలిస్తున్నాడు.
 
ఇంతలో పాదాచారాలు అందించిన సమాచారంతో ఆంబులెన్స్ వచ్చి, చావుబతుకుల మధ్య ఉన్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పైగా, ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఈ కత్తి దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయిన మరుసటిరోజే నవ వధవు అదృశ్యం.. భర్తను వీడి...