Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు పౌర్ణమి.. అతిపెద్ద చందమామ.. తప్పక చూడాల్సిందే..

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:35 IST)
Full Moon
జులై 13 పౌర్ణమి. ఈ రోజున అతి పెద్ద చందమామ కనిపించనున్నాడు. అంతేగాకుండా ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు పడుతున్నాయి. పైగా ఆకాశంలో మబ్బులు ఉన్నాయి. 
 
అందువల్ల మనం నేటి చందమామను చూడగలమో లేదో చెప్పలేం. సంపూర్ణ చందమామ ఉన్నప్పుడు అద్భుతమైన శక్తులను సాధించుకోవచ్చునని విదేశీయులు భావిస్తారట. 
 
అలాగే సంపూర్ణ చందమామ అంటే పౌర్ణమి రోజున మగ దుప్పికి కొమ్ములు బాగా పెరుగుతాయట. అంటే అందువల్ల ఇవాళ్టి చందమామను దుప్పి చందమామ (Buck Moon) అని కూడా అంటున్నారు. ఇవాళ్టి మూన్‌ని పిడుగుల మూన్ (thunder moon) అని కూడా అంటారు. కారణం ఈ సీజన్‌లో పిడుగులు బాగా పడతాయి. 
 
ఈ రోజున చందమామ భూమికి చాలా దగ్గరగా సంచరిస్తాడట. ఇవాళ రాత్రికి చందమామకు కొంత దగ్గర్లో శనిగ్రహం, గురుగ్రహం, అంగారక గ్రహం కనిపిస్తాయి. ఇవి అర్థరాత్రి తర్వాత బాగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎరుపు నారింజ రంగులో మార్స్ ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 
 
తూర్పు, ఆగ్నేయ దిశలో శనిగ్రహం కనిపిస్తుంది. గురుగ్రహం అర్థరాత్రి తూర్పు వైపున కనిపిస్తుంది. రాత్రి 2 తర్వాత మార్స్ ఎక్కువ కాంతితో కనిపిస్తుంది. ఇవాళ్టి నుంచి ఇది కాంతిని పెంచుకుంటూ పోతూ... అక్టోబర్‌లో అత్యంత ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తుంది. 
 
అందువల్ల మార్స్‌ని టెలిస్కోప్‌తో ఫొటో తియ్యాలంటే అక్టోబర్ సరైన సమయం. గ్రహాల్లో ఎక్కువ కాంతివంతంగా కనిపించే శుక్రగ్రహం జులై 14 ఉదయం 5 గంటలకు తూర్పువైపున మెరిసే వజ్రంలా కనిపిస్తుంది. 
 
ఆ సమయంలో శుక్రగ్రహానికి కుడివైపున వరుసగా అంగారకుడు, గురుగ్రహం, చందమామ, శనిగ్రహం కనిపిస్తాయి. ఇవన్నీ అంతరిక్షంలో అద్భుతాలు. వీటిని మిస్సైతే మళ్లీ మళ్లీ రావు. ఇవి వచ్చినప్పుడే చూసేస్తే.. అదో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Pawan: హరి హర వీరమల్లు అసలు కథ ఇదేనంటే క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments