Webdunia - Bharat's app for daily news and videos

Install App

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (16:32 IST)
monkey
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి చేతిలోని దాదాపు రెండు లక్షల విలువైన ఫోన్‌ ఎత్తుకెళ్లిపోయింది ఓ కోతి. అంతే ఆ వ్యక్తి పరిస్థితి చెప్పడం మాటల్లో కుదరలేకపోయింది. ఆ కోతి నుంచి ఆ ఫోన్‌ను ఎలా తీసుకోవాలని ఆలోచించాడు. ఇంకా ఆ మంకీ చేతుల్లోంచి ఆ ఫోను లాక్కునేందుకు నానా తిప్పలు పడ్డాడు. అతని చేతిలోని ఫోన్‌ లాక్కొని వెళ్లిన ఆ వానరం ఎత్తయిన గోడమీద కూర్చుంది. 
 
రూ.లక్ష 50 వేలు పెట్టి కొనుక్కున్న శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ అది. కోతినుంచి ఫోన్‌ ఎలా దక్కించుకోవాలా అని ఆలోచనలో పడ్డ అతను పక్కనే షాపులో మ్యాంగో డ్రింక్‌ ప్యాకెట్లు కొన్నాడు. ఆ ప్యాకెట్‌ పట్టుకొచ్చి కోతి వైపు విసిరాడు. చేతిలో జ్యూస్‌ ప్యాకెట్‌ పడగానే కోతి క్యాచ్‌ ఇట్‌ అన్నట్టుగా ఫోన్‌ను అతనివైపు విసిరింది. 
 
వెంటనే ఫోన్‌ అందుకొని హమ్మయ్య అనుకుంటూ అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కోతుల తెలివితేటలపై సెటైర్లు వేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Modern monk ???? (@kartik_rathoud_134)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments