భారతీయ శాస్త్రాల్లో మంత్రాలకు అపారమైన శక్తి ఉందని అంటుంటారు. ఈ విషయం తాజాగా మరోమారు నిరూపితమైంది. ఓ వ్యక్తి తన మంత్రపఠన శక్తితో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ కోతి (కొండముచ్చు)ని బతికించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కరెంట్ షాక్‌కు తగిలి కిందపడిపోయి కొనఊపిరితో ఉన్న కోతిని బతికించేందుకు ఓ వ్యక్తి తనకు వచ్చిన ఓ మంత్రాన్ని జపిస్తూ, ఆ కోతి ముఖంపై ఒక్కో చుక్క నీరు పోశాడు. అతను పఠించిన మంత్రం పూర్తయ్యే సమయానికి ఆ కోతి కూడా లేచి కూర్చొంది.
ఈ వింతను చూసిన స్థానికులు చప్పట్లు కొడుతూ ఆ వ్యక్తిని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అది భారతీయ మంత్రాలకు ఉన్న శక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు.