కిషన్ రెడ్డికి తీపి కబురు.. కీలక బాధ్యతలు అప్పగించిన మోదీ

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (14:43 IST)
ఓటమి విజయానికి తొలి మెట్టు అంటారు. కిషన్‌రెడ్డి విషయంలో అది నూటికి నూరు శాతం నిజమైంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీతో పాటు బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో మొత్తం 57 మందికి మంత్రి పదవులు దక్కాయి. మోదీ మంత్రి వర్గంలో 21 మంది కొత్తవారు కాగా, 36 మంది గతంలో మంత్రులుగా పని చేసినవారే, మరో 9 మందిని స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేసారు. 
 
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే కీలకమైన కేంద్ర హోం శాఖను మోదీ సన్నిహితుడైన అమిత్ షాకు కట్టబెట్టడం విశేషం. మోదీ కిషన్ రెడ్డిని తన కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్‌ కొనసాగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి తీపి కబురు వినిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments